Thursday, February 10, 2011

యువ భారత్ యూత్

ఉన్నంతలో కొందరికైనా సహాయం చేద్దాం









నమస్కారం అండి!
నేను మీకు సూటిగా సుత్తిలేకుండా మా యూత్ గురించి వివరిస్తాను.
మా ఊరిపేరు విరవ- పిఠాపురం మండలం- తూర్పుగోదావరి జిల్లా లో ఉంది.
మా ఊరి లో నేను నా ఫ్రెండ్స్ కలిసి యువభారత్ యూత్ ని స్టార్ట్ చేసాం. మా ఉద్దేశం లో భగవంతుడికి పూజలు చేసేకంటే ప్రక్కవాడికి సహయంచేయడం ఉత్తమం.ప్రక్కవాడికి సహాయంచేయడానికి మనకి వేలకొద్ది డబ్బు అవసరం లేదు, సహాయం చేయాలనే ఆలోచనవస్తే డబ్బు అదేవస్తుంది . 
మేము చేయబోయే కార్యక్రమలో కొన్ని చెప్తాను..మధ్యలో చదువు ఆపివేసిన వాళ్ళకు రాత్రి పూట వారికీ చదువు చెప్పడం. వారి ఇంటర్స్ట్    బట్టి వారిని 10th క్లాసు ఎగ్జామ్స్ కి సిద్దం చేయడం. వర్షాకాలం లో కనీసం ఉరు మొత్తం మీద 200 మొక్కలను నాటడం, 10th క్లాసు వాళ్లకు Higher Education Awareness క్లాసు లు ఏర్పాటు చేయడం. పరిమితలుకు లోబడి ప్రభుత్వ పధకాలను సక్రమంగా అమలు జరిగేటట్టు చూడటం. విద్యార్దులకు ప్రతేకంగా గ్రంధాలయం ఏర్పాటు చేయడం. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేసి ఇంటర్ పూర్తీ చేసినవారికి కంప్యూటర్ నందు శిక్షణ ఇచ్చుట.  ఇవేకాకుండా  మీరు ఇచ్చేసలహాలను అమలుచేయడం కూడా జరుగుతుంది. మేము చేయబోయే కార్యక్రమాలు అన్ని వెంటనే జరగవనే విషయం మాకు తెలుసు వాటికి టైం పడుతుంది కాని వాటిని చేసితిరుతాం. 

ఈ యువభారత్ యూత్ కి ప్రత్యేకంగా నాయకులు అంటూ ఏవరు లేరు , ఏవరైతే  ఉరికి సేవచేద్దాం అనుకుంటారో వారే యువభారత్ యూత్ కి నాయకులు. యువభారత్ యూత్ ద్వారా ఇప్పడివరకూ చేసిన కార్యకమాలు వరుసగా ఉచిత హోమియో శిబిరము ఏర్పాటు చేసి   స్వైన్ ప్లూవ్ మందులను పంపిణి చేసాము. గ్రామం లో" శుబ్రత - ఆరోగ్యం" కొరకు మంచినీటి బావుల దగ్గర శుబ్రం చేసి బావిలో బ్లిసింగ్ కలపడమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ బావిలో కూడా బ్లిసింగ్ ను కలపడం కొరకు వర్షం లో  తడిచి మరీ యూత్ సబ్యులు ఆ కార్యక్రం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ యువభారత్ యూత్ ద్వారా ఓల్డ్ బుక్స్ సేకరించి సుమారుగా 21 మందికి ఇవ్వడం జరిగింది.



ది 14-12-12 నాడు యువభారత్ యూత్ ద్వారా మరో మూడు కుటంబాలకు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది . ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాద  ..


భర్తను కోల్పోయి 10 రోజులు కూడా గడవక ముందే తండ్రి సమానుడైన మామగారిని కూడా కోల్పోయింది ఈమే . విధి పగపడ్డిందేమో  అన్నట్లుగా ఉంటున్న ఇల్లు కూడా నీడను ఇవ్వకబోగా ఆమె పాలిట భారమై కూర్చుంది . ఇద్దరామ్మిలలో  ఒక్కరిని ఇప్పడికే పుట్టింటికి పంపించి అమ్మగారి ఇంటిదగ్గర చదివిస్తుంది (ఏజ్ 6 స || వ). చిన్నామ్మయిని  తను "ఆయాగా " పనిచేస్తున్నా  శారద విద్యాలయం వారు ఫ్రీ గ చదివిస్తున్నారు ( 4 స|| వ).  యూత్ ద్వారా 1000/- ఇవ్వడం జరిగింది .








స్కూల్ కి వెళ్తున్నా  పిల్లవాడు ఇప్పుడు తండ్రిని కోల్పోయి పనిలోకి వెళ్తున్నాడు . ఇంటి భారం తన భుజాలపై వేస్కుని అమ్మకు అక్కకు నేను ఉన్నాను అని దైర్యం చెప్పాడు నిండా 15 స || వ || కూడా దాటిని ఆ పిల్లవాడు . పనిలోకి వెళ్ళవద్దు అనే అంత  దైర్యం చేయలకాపోయం . 10th క్లాసు ప్రేవైట్ గా కట్టించండి మేము చదువు చెప్తాం  అనే మాట తప్ప ఎం రాలేదు మా నోటివెంట . ఆమె కు 1000/- ఇవ్వడం జరిగింది .




తను నేర్చుకున్నా కుట్టు మిషన్ .. ఇప్పుడు ఆ ఇంటికి జీవనాధారం . పిల్లవాడి పైన గంపేడు  ఆశలు పెట్టుకుని జీవిస్తుంది తను . 7th  క్లాసు చదువుతున్నా  ఆ పిల్లవాడి కి యూత్ ద్వారా చేయగల సహాయం చేస్తాం అని చెప్పడం తో పాటు 1000/- ఇవ్వడం జరిగింది .

(16-8-12 )విరవ లో లోకల్ లో పనిచేసే electrician నాగేశ్వరావు  గారు  ఈ మధ్య కాలం లో కరెంటు స్థంబం పై పనిచేస్తూ ఉండగా .. ఎవరో మెయిన్ ఆన్చేయడం వాళ్ళ  పైనుంచి క్రిందపడిపోయారు .  పాపం ఒక చెయ్యి తొలగించారు  :( . రెండో చెయ్యి పనిచేయదు . ఉన్నట్టు ఉండి ఆ కుటుంబం రోడ్ పై పడిపోయింది .  ఆయనకి ఒక అబ్బాయ్ ఒక అమ్మాయ్ .. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయ్  . నాగేశ్వరావు గార్కి 5000 /- యూత్ ద్వారా ఇవ్వడం జరిగింది.




కోరుకొండ దుర్గ ప్రసాద్ 10th class చదివిన తరువాత  ఇంటిదగ్గర పరిస్థితి బాగోలేదు అని కూరగాయల మార్కెట్  లో జాయిన్  అయ్యాడు . ఒక సంవత్సరం తరువాత పిఠాపురం govt.Jr  లో జాయిన్ అయ్యాడు M.P.C ఆ సంవత్సరం ఆ కాలేజీ ఫస్ట్ సాదించాడు  . ఇంటర్ రెండవ సంవత్సరం  లో ఉండగా  వాళ్ళ నాన్నగారు మరణించారు .  ఆ అబ్బాయి  కి 5000 /-ఇవ్వడం జరిగింది . ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు
మాపైన నమ్మకంతో కనీసం ఎప్పుడు చూడకపోయినా వెనకాలే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి శిష్యునకు మా హృదయ పూర్వక ధన్యవాదములు .